నిత్యావసర ధరలు తగ్గిస్తామన్న హామీలు ఏమయ్యాయి?

 తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్

తిరువూరు: నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల జీవనం భారంగా మారిందని తిరువూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్‌, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ పేర్కొన్నారు. తిరువూరు పట్టణంలోని 25వ వార్డులో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పరసా శ్రీనివాసరావు (బీరువాల బాబు), 25వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ధర్మవరపు తిరుపతమ్మకు మద్దతుగా ఇంటింటికీ ప్రచారం నిర్వహించి, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఎన్నికల ముందు నిత్యావసర ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ధరల నియంత్రణలో విఫలమైందని స్వామిదాస్ మండిపడ్డారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో కుటుంబ పోషణ కష్టంగా మారినా ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. సామాన్యులకు ఆర్థిక ఉపశమనం కల్పించేలా నిత్యావసర ధరలను నియంత్రించాలని కోరారు. తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ చైర్మన్ అభ్యర్థి పరసా శ్రీనివాసరావు, 25వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ధర్మవరపు తిరుపతమ్మకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top