ప్రజాస్వామ్య హక్కులను హరించే ఆంక్షలు తగవు!

 పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సునీల్‌కుమార్‌కు ప్రివెంటివ్‌ హౌస్‌ డిటెన్షన్‌ నోటీసు

చిత్తూరు జిల్లా: పూతలపట్టు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ ఎం. సునీల్‌కుమార్‌ను ఇంటికే పరిమితం చేస్తూ పలమనేరు అర్బన్‌ పోలీసులు ప్రివెంటివ్‌ హౌస్‌ డిటెన్షన్‌ నోటీసు జారీ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేపథ్యంలో అక్టోబర్‌ 25వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి అక్టోబర్‌ 26వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు లేదా ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇంటి వద్దనే ఉండాలని నోటీసులో పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులకు, ప్రజలకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంది. చట్టబద్ధమైన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే స్వేచ్ఛను కాపాడటం ప్రభుత్వంతో పాటు అధికారుల బాధ్యత. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలనే పేరుతో రాజకీయ నాయకుల స్వేచ్ఛకు ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఎన్నికల ప్రక్రియలో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలి. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో తీసుకునే ప్రతి చర్య చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా ఉండాలి. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. వైయ‌స్ఆర్‌సీపీ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు, ప్రజల గొంతుకను వినిపించేందుకు కట్టుబడి ఉంటుంది. 

Back to Top