డీఎస్సీ అక్రమాలపై నిరసనకు వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతల అరెస్ట్

 గుంటూరు: విజయవాడలోని శాప్‌ కార్యాలయం వద్ద డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలు, అవకతవకలకు నిరసనగా నిర్వహించనున్న కార్యక్రమానికి వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను పోలీసులు కాజా టోల్‌గేట్‌ వద్ద అడ్డుకున్నారు. పార్టీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నిరసనలో పాల్గొనేందుకు వెళ్తున్న జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్‌ బాబు), పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా తదితరులను పోలీసులు అడ్డుకున్నారు.

అనంతరం వారిని పెదకాకాని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, అవకతవకలపై నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంపై వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Back to Top