మహాకవి గురజాడకు వైయ‌స్‌ జగన్‌ నివాళి

 తాడేపల్లి: మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావును వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్మరించుకున్నారు. గురజాడ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వైయ‌స్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘కన్యాశుల్కం వంటి చిరస్మరణీయ నాటకం ద్వారా తెలుగు సాహిత్యానికి కొత్త ఒరవడి తీసుకొచ్చి, నాటి సాంఘిక దురాచారాలను ప్రశ్నించిన మహాకవి గురజాడ అప్పారావు. తన రచనలు, కవితలతో ప్రజల్లో సమాజం పట్ల బాధ్యతను, చైతన్యాన్ని నింపిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
 

Back to Top