వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర కమిటీలో ముగ్గురికి కీలక బాధ్యతలు

 సీఈసీ సభ్యురాలిగా బుచ్చేపల్లి వెంకాయమ్మ.. ఎస్‌ఈసీ సభ్యుడిగా గంగ సురేష్‌ బండారు.. రాష్ట్ర కార్యదర్శిగా ఇందుకూరి సత్యనారాయణరాజు

 తాడేపల్లి :  వైయ‌స్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కమిటీలో ముగ్గురికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి చెందిన బుచ్చేపల్లి వెంకాయమ్మను సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (సీఈసీ) సభ్యురాలిగా నియమించారు. 

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన గంగ సురేష్‌ బండారును స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఈసీ) సభ్యుడిగా నియమించారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన ఇందుకూరి సత్యనారాయణరాజును వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.  

పార్టీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నేతలు పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Back to Top