వైయ‌స్‌ జగన్‌ దృష్టిలో బీసీ అంటే ‘బ్యాక్‌బోన్‌ క్లాసెస్‌’

 బీసీలను తలెత్తుకునేలా చేసింది వైయ‌స్‌ జగన్‌ పాలనే: బొత్స సత్యనారాయణ

 విశాఖపట్నం: వైయ‌స్‌ జగన్‌ దృష్టిలో బీసీ అంటే బ్యాక్‌బోన్‌ క్లాసెస్ అని వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.  ప్రచార ఆర్భాటం తప్ప బీసీలకు టీడీపీ చేసిందేమీ లేదని విమ‌ర్శించారు. విశాఖపట్నంలో నిర్వహించిన వైయ‌స్ఆర్‌సీపీ బీసీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు మేలు చేయడంలో చంద్రబాబు పాలనకు, వైయ‌స్‌ జగన్‌ పాలనకు చాలా తేడా ఉందన్నారు. బీసీలను సమాజంలో తలెత్తుకుని నిలబడేలా వైయ‌స్‌ జగన్‌ చేశారని పేర్కొన్నారు.

టీడీపీ నేతలు చంద్రబాబు మోసాన్ని ఎందుకు నిలదీయడం లేదని బొత్స ప్రశ్నించారు. పుట్టిన ప్రాంతానికి, కులానికి న్యాయం చేయాలని టీడీపీ బీసీ నేతలు ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు నోరు మెదపకుండా కూర్చున్నారని విమర్శించారు.  బీసీలకు రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు కల్పించడంతో పాటు పార్టీ కమిటీల్లోనూ వారికి ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు.

Back to Top