మహ్మద్‌ ప్రవక్త సందేశం సదా అనుసరణీయం

మిలాద్‌-ఉన్‌-నబీ శుభాకాంక్షలు తెలిపిన వైయస్‌ జగన్‌

తాడేపల్లి: మిలాద్‌-ఉన్‌-నబీ పర్వదినం సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌ ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమతో మనసులు గెలవాలని, కరుణతో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలని మహ్మద్‌ ప్రవక్త మానవాళికి అందించిన సందేశం సదా అనుసరణీయమని పేర్కొన్నారు.

క్షమ, సహనం, సోదరభావాలతో శాంతియుత సమాజాన్ని నిర్మించాలన్న మహ్మద్‌ ప్రవక్త సందేశం అందరికీ ఆదర్శనీయమని వైయ‌స్‌ జగన్‌ తెలిపారు. మహ్మద్‌ ప్రవక్త జన్మదినమైన మిలాద్‌-ఉన్‌-నబీ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
 

Back to Top