నెల్లూరు: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై వైయస్ఆర్‌సీపీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త పోరాటం విజయవంతమైందని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు డా. కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించి, బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైయస్ఆర్‌సీపీ పిలుపుతో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నిరసనలు, ర్యాలీలు విజయవంతమయ్యాయని కాకాణి తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలు, కందుకూరుతో కలిపి 11 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, డీఎస్సీ బాధిత అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని చెప్పారు. ప్రశ్నించే గొంతులను అణచివేత డీఎస్సీ అక్రమాలపై ప్రజల్లో చర్చ మొదలవడంతో ప్రభుత్వం వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు, నిర్బంధాలు, ఆంక్షలకు పాల్పడుతోందని కాకాణి ఆరోపించారు. శాంతియుత ర్యాలీలకు ముందుగానే అనుమతులు కోరినా చివరి నిమిషంలో నిరాకరించి కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల ప్రజల్లో వ్యవస్థలపై నమ్మకం దెబ్బతింటోందని పేర్కొన్నారు. డీఎస్సీపై సీబీఐ విచారణే పరిష్కారం డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై వైయస్ఆర్‌సీపీ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాకాణి కోరారు. డీఎస్సీ ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను చెల్లించలేని ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఎలా నడుపుతుందని ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని, భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.