కర్నూలు: మండలంలోని రేమట గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ మిద్దెపోగు జేమ్స్ గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలుసుకున్న వెంటనే కోడుమూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గ్రామానికి చేరుకుని ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేమ్స్ కుటుంబ సభ్యులను పరామర్శించిన డాక్టర్ ఆదిమూలపు సతీష్ వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జేమ్స్ పార్టీకి అంకితభావంతో పనిచేసిన నాయకుడని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, వైయస్ఆర్‌సీపీ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. జేమ్స్ ప్రజాసేవతో పాటు పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేశారని, ఆయన సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని డాక్టర్ ఆదిమూలపు సతీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జడ్పీటీసీ ప్రసన్నకుమార్, సీనియర్ నాయకులు తిరుమల్ రెడ్డి, రేమట సంపత్ కుమార్, కోడుమూరు నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొని జేమ్స్‌కు నివాళులర్పించారు.