గుర్రం జాషువాకు వైయ‌స్‌ జగన్‌ నివాళులు

తాడేపల్లి: మహాకవి గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా జాషువా సాహితీ సేవలను, సమానత్వం కోసం ఆయన సాగించిన అక్షర పోరాటాన్ని స్మరించుకున్నారు.

‘‘అణగారిన వర్గాల ఆవేదనను అక్షరాల్లో ఆవిష్కరించి, సమానత్వం, ఆత్మగౌరవం, మానవీయ విలువల కోసం తన చివరి శ్వాస వరకు అక్షర పోరాటం సాగించిన మహాకవి గుర్రం జాషువా. కాలం మారినా ఆయన ఆలోచనలు, ఆయన సాహిత్యం సమాజానికి చైతన్యాన్ని, సమానత్వానికి స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు’’ అని వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు.
 

Back to Top