తాడేపల్లి: సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతి సందర్భంగా వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు వైయస్ జగన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘‘కృష్ణా–గోదావరి నదీ జలాలను సద్వినియోగం చేసి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బలమైన పునాది వేసిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ గారు. ఆయన దూరదృష్టితో రూపుదిద్దుకున్న సాగునీటి వ్యవస్థలు ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేసి, వ్యవసాయ రంగ ప్రగతికి నూతన దిశానిర్దేశం చేశాయి. నేడు సర్ ఆర్థర్ కాటన్ గారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నా’’ అని వైయస్ జగన్ పేర్కొన్నారు.