మండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి తూమాటి మాధవరావు

 మాధవరావుకు ఎమ్మెల్సీలంతా పూర్తి మద్దతు ఇవ్వాలి.. 

ఎన్నిక సాఫీగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలి: వైయస్‌ జగన్‌

తాడేపల్లి : శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి వైయస్సార్‌సీపీ తరఫున తూమాటి మాధవరావును ప్రతిపాదిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ ప్రకటించారు. తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో మండలి డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికకు సంబంధించి పార్టీ ఎమ్మెల్సీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. శాసనమండలిలో డిప్యూటీ ఛైర్మన్‌ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉందని, త్వరలో ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ తరఫున తూమాటి మాధవరావు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు వైయస్‌ జగన్‌ తెలిపారు.

మాధవరావు అభ్యర్థిత్వానికి పార్టీ ఎమ్మెల్సీలందరూ పూర్తి మద్దతు ఇవ్వాలని సూచించారు. ఎన్నిక ప్రక్రియ సాఫీగా జరిగేలా ఎమ్మెల్సీలంతా పరస్పర సమన్వయంతో పనిచేయాలని, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. మాధవరావు ఎన్నికకు అవసరమైన అన్ని చర్యలను సమన్వయంతో చేపట్టాలని వైయస్‌ జగన్‌ ఎమ్మెల్సీలకు సూచించారు.
 

Back to Top