డీఎస్సీ అక్రమాలను ప్రశ్నించినందుకు జమ్మలమడుగులో 400 మందిపై కేసులు

వైయ‌స్ఆర్‌ జిల్లా: డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో జమ్మలమడుగులో ఈ నెల 10న నిర్వహించిన శాంతియుత ర్యాలీపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ర్యాలీలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో పాటు సుమారు 400 మందిపై కేసులు నమోదయ్యాయి.

డీఎస్సీ అక్రమాలపై న్యాయం కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదు చేయడం కూటమి ప్రభుత్వ కక్షసాధింపు ధోరణికి నిదర్శనమని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే సూచనలతో  వైయ‌స్ఆర్‌సీ చేపట్టిన దీక్షలను పోలీసులు భగ్నం చేశారని, ఇప్పుడు ర్యాలీ నిర్వహించినా కేసులు పెట్టారని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేశారు.
 

Back to Top