ప్రజల సమస్యలపై షేక్‌ నూరి ఫాతిమా ప్రత్యక్షంగా ఆరా

 గుంటూరు తూర్పులో తాగునీటి సమస్యలపై పర్యటన
 

గుంటూరు:  నగరంలోని తూర్పు నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి షేక్‌ నూరి ఫాతిమా విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా బి.ఆర్‌. స్టేడియం సమీపంలోని మంచినీటి ట్యాంకులతో పాటు ముఫ్తీ మొహల్లా (నందు పరేడ్‌) ప్రాంతాన్ని ఆమె సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని పరిశీలించారు.  స్థానిక ప్రజలను నేరుగా కలిసి తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను షేక్‌ నూరి ఫాతిమా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కాలుష్యమైన నీరు సరఫరా కావడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని, సమస్య తీవ్రతను పరిశీలించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందడం ప్రభుత్వ బాధ్యతని, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

Back to Top