పల్నాడు జిల్లా: మాచవరం మండలం కొత్త గణేష్‌పాడు గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ నాయకుడు బొంత పెద్ద గురవయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 2023లో గొర్రెల విషయంలో జరిగిన ఘర్షణకు సంబంధించి నమోదైన కేసులో రాజీ పడాలని మాచవరం పోలీసులు తనపై ఒత్తిడి తెస్తున్నారని పెద్ద గురవయ్య ఆరోపిస్తున్నారు. గత మూడు రోజులుగా తనను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కేసులో రాజీ పడాలని ఎస్సై వేధిస్తున్నారని తెలిపారు. పోలీసుల వేధింపులతో మనస్తాపం కేసులో రాజీకి అంగీకరించకపోవడంతో తనను పదేపదే పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వేధింపులకు గురిచేస్తున్నారని పెద్ద గురవయ్య పేర్కొన్నారు. ఈ వేధింపులు తాళలేక మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. టీడీపీ నాయకులు చల్లగుండ్ల బిక్షమయ్య, నంబుల గంగాద్రి, నంబుల సింగరయ్య, చల్లగుండ్ల శ్రీకాంత్, నన్నపనేని గంగప్రసాద్ ఒత్తిడితోనే పోలీసులు తనను కేసులో రాజీకి ఒత్తిడి చేస్తున్నారని పెద్ద గురవయ్య ఆరోపించారు. పురుగుల మందు తాగిన ఆయనను కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.