ఆళ్ల‌గడ్డలో టీడీపీకి భారీ షాక్  

నంద్యాల జిల్లా: ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం చాగలమర్రి మండలం గొడిగనూరు గ్రామంలో టీడీపీకి భారీ షాక్. పోలికల పెద్దిరెడ్డి, లింగారెడ్డి, రామచంద్రారెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, చిన్న రామిరెడ్డితో పాటు 15 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. మాజీ శాసనసభ్యులు  గంగుల బిజేంద్రారెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన నేతలు, కుటుంబ సభ్యులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

గ్రామస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణకు ఈ చేరికలు నిదర్శనంగా నిలిచాయి. ప్రజల సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటానికి ఆకర్షితులై పెద్ద సంఖ్యలో కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నాయి. చాగలమర్రి మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారితో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరింత బలంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
 

Back to Top