పెనుమాక రైతుల ఆహ్వానం మేరకు వైయ‌స్ఆర్‌సీపీ బృందం పర్యటన

భూములు ఇవ్వకపోవడంపై ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందంటూ రైతుల ఆవేదన.

ఈ నేపధ్యంలో ఇవాళ పెనుమాక గ్రామానికి వెళ్లిన సీఆర్డీయే రైతు పరిరక్షణ కమిటీ.

ఉండవల్లి గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, సీఆర్డీయే రైతు పరిరక్షణ కమిటిపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు. 

ఈ నేపధ్యంలో తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సీఆర్ డీ ఏ రైతు పరిరక్షణ కమిటీ.

భూముల చుట్టూ కందకాలు తవ్వడం అరాచకం

బాధిత రైతుల కోసమే మా పర్యటన

ప్రభుత్వ దుర్మార్గాలు బయటపడతాయనే మాపై భౌతిక దాడులు

లోకేష్, చంద్రబాబుల పక్కా స్కెచ్‌తో దాడి.

ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)

రైతుల ముసుగులో ఉన్నది టీడీపీ గూండాలే 

మాపై దాడికి దిగిన మీదే ‘గొడ్డలి పార్టీ’?

రక్షించాల్సిన పోలీసులే ప్రేక్షక పాత్ర 

కానిస్టేబుల్ తల పగలగొట్టిన రౌడీలను అరెస్ట్ చేయాలి.

మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్. 

మంత్రి లోకేష్ జీతగాళ్ల ఆధ్వర్యంలోనే మాఫియా రాజకీయం 

మాపై దాడికి కర్త, కర్మ, క్రియ వాళ్ళే!

 మంగళగిరి చరిత్రలో లేని దుర్మార్గపు సంస్కృతి 

 దాడులకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు!

తేల్చి చెప్పిన మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి.

రౌడీ మూకల దాడులకు వైయ‌స్ఆర్‌సీపీ లొంగదు 

 అమరావతి రైతుల బాగు కోసం కూటమి మెడలు వంచుతాం!

పోలీసుల ముందే మట్టి, ఇసుక మాఫియా ముఠాల విధ్వంసం

ప్రతి రైతును కమిటీ కలిసి తీరుతుంది

ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ స్పష్టీకరణ 

రాజధానిలో అమలవుతున్న ‘రెడ్ బుక్ రాజ్యాంగం’

భయపెట్టైనా రైతుల భూములు లాక్కోవాలనే కుట్ర!

కేవలం కమిటీ, న్యాయవాదుల బృందం వెళ్తే దాడి చేస్తారా? 

అమరావతి రైతులకు వైఎస్ జగన్ గారే అండ

హామీ ఇచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ నేత దేవినేని అవినాష్

చంద్రబాబు ఇంటికి కూతవేటు దూరంలోనే మాజీ మంత్రులపై దాడులు

కూటమి ప్రభుత్వాన్ని ఛీకొడుతున్న మేధావులు

ఏ రైతుకు ఇబ్బంది వచ్చినా వైయస్సార్సీపీ జెండా అండగా ఉంటుంది

అమరావతి దోపిడీని ప్రశ్నిస్తామనే భయంతోనే దాడులు

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఆర్డీయే రైతు పరిరక్షణ కమిటీ నేతలు ఏమన్నారంటే.. 

పేర్ని వెంకట్రామయ్య(నాని), మాజీ మంత్రి.

తాడేప‌ల్లి: ప్రభుత్వానికి అస్సలు అవసరం లేకపోయినా ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల్లో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం అత్యంత దుర్మార్గం. తమ మాట వినని రైతుల భూముల చుట్టూ 20 నుండి 30 అడుగుల లోతులో కందకాలు (చెరువుల పేరుతో) తవ్వుతూ, రైతులు పంటలు వేసుకోకుండా అరాచకానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ వేధింపులకు గురైన  రైతులు వైఎస్ జగన్ ని కలిసి బాధలు చెప్పుకున్నారు.రోడ్డు వరకు భూమి ఇచ్చేయండి, మిగతా భూమి కోసం న్యాయపోరాటం చేద్దాం" అని వైఎస్ జగన్ గారు రైతులకు ధైర్యం చెప్పారు. వారి సమస్యల పరిష్కారానికి వైయస్సార్సీపీ లీగల్, పొలిటికల్ కమిటీలను ఏర్పాటు చేశారు.

ఇప్పటికే రెండు దఫాలు  రైతులతో సమావేశం జరిగింది. ఇవాళ బాధిత రైతుల పిలుపు మేరకు పెనుమాక వెళ్తున్న వైఎస్సార్సీపీ కమిటీపై చంద్రబాబు,లోకేష్‌ల పథకం ప్రకారం.. టీడీపీ గూండాలు ఉండవల్లి సెంటర్ వద్ద మద్యం మత్తులో దారుణంగా దాడికి తెగబడ్డారు. ఉదయం 7:30 గంటల నుంచే బాలకొండ సత్యం అనే వ్యక్తి రౌడీలను పోగేసి దాడికి పురిగొల్పాడు. దాడిలో పాల్గొన్న రాధాకృష్ణ, రామాంజనేయులు, అబ్బాయి మురళి, మోపిదేవి వెంకటరమణారావు లాంటి వారికి అసలు అక్కడ పొలాలే లేవు, వీరెవ్వరూ రైతులు కారు.

పోలీసుల వైఫల్యం – డీఎస్పీ ప్రోత్సాహం.
వైయస్సార్సీపీ నేతల కార్లను ధ్వంసం చేసి, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రుల కార్లను పూర్తిగా ధ్వంసం చేసి నాయకులను అంతమొందించే వ్యూహం రచించారు. స్థానిక డీఎస్పీ రంగంలోకి వచ్చాక రౌడీ మూకలను అదుపు చేయాల్సింది పోయి, ఉద్రిక్తతలను మరింత పెంచి ధ్వంస రచనను ప్రోత్సహించారు.  బందోబస్తులో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్‌పై రాయి విసరడంతో ఆయన తల పగిలి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వీటన్నింటికీ సంబంధించిన స్పష్టమైన వీడియో సాక్ష్యాలు మీడియా కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ నేపధ్యంలో రైతు పరిరక్షణ కమిటీ నేతలపై దారుణంగా దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై తక్షణమే హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి.  నేతల వాహనాలను ధ్వంసం చేసిన నిందితులను మరియు విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌ను కొట్టిన రౌడీలను, వారి వెనుక ఉన్న సూత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలి. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని అకృత్యాలు చేసినా, అమరావతి పేరుతో సాగుతున్న అవినీతిని, రైతుల అగచాట్లను ప్రపంచం ముందుకు తెస్తాం. బాధితుల తరఫున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఎప్పటికీ ఆపదు.

అంబటి రాంబాబు, మాజీ మంత్రి.

ప్రభుత్వం చట్టపరంగా భూములు తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ రాజధాని పరిసర ప్రాంతాల రైతులు వైఎస్ జగన్  ని  కలిసి... తాము పూలింగ్ ఇవ్వనందుకు కక్షతో నోటీసులు ఇస్తూ, తమపై ఒత్తిడి తెచ్చి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై  వైయస్. జగన్  స్పందించి సమస్యల పరిశీలన కోసం, రైతులకు అండగా ఉండేందుకు లీగల్ మరియు పొలిటికల్ కమిటీలను ఏర్పాటు చేశారు.
ఈ కమిటీలు రైతులతో రెండు సార్లు సమావేశమయ్యాయి. మొదటి సమావేశంలో రైతుల కోరిక మేరకు లీగల్ టీమ్ గ్రామాలకు వెళ్లి చట్టపరమైన అంశాలను వివరించగా, రెండో సమావేశంలో పొలిటికల్ టీమ్‌ను గ్రౌండ్ లెవెల్‌కు వచ్చి తమ పరిస్థితిని మీడియాకు, సమాజానికి వివరించాల్సిందిగా రైతులు కోరారు. రైతుల సమస్యలను ప్రాక్టికల్ గా, గ్రౌండ్ లెవెల్ లో తెలుసుకోవడానికి తాము (మాజీ ప్రజా ప్రతినిధులుగా) వెళ్లగా, ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా దాడికి పాల్పడ్డారు. 
ఈ సందర్బంగా మా పై ఒక పెద్ద రాయితో దాడి చేసే ప్రయత్నం జరిగితే.. ఆ సమయంలో మధ్యలో అడ్డువచ్చిన ఒక కానిస్టేబుల్‌కు ఆ రాయి తగిలి గాయమై హాస్పిటల్‌లో చేరారు. ఆ రాయి మాలో ఎవరికైనా తగిలి ఉంటే ప్రాణాపాయం జరిగి ఉండేది. 
నారా లోకేష్ నియోజకవర్గంలోనే ఈ గొడవ జరిగింది. వైయస్సార్సీపీ నేతలు ఎవరిపైనా దాడికి దిగలేదు. టీడీపీ కార్యకర్తలే దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీని 'గొడ్డలి పార్టీ' అని ప్రచారం చేసిన మీరే..  మా పై దాడి చేశారు.  ఎవరిది గొడ్డలి పార్టీ. మీది కాదా 
మరోవైపు దాడి జరుగుతున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.  అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని, మమ్నల్ని వెళ్ళవద్దని నివారించారు. అయితే ముందుగానే కార్యక్రమాన్ని ప్రకటించుకుని వెళ్తున్న మేం ఎందుకు ఆగిపోవాలి. పోలీసులు న్యాయం వైపు కాకుండా తెలుగుదేశం కార్యకర్తలకు అనుకూలంగా వ్యవహరిస్తూ మమ్నల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. 
వైయస్సార్సీపీ నాయకులకు రాళ్లు, కర్రలు, ప్లకార్డులు చూపిస్తూ 'గో బ్యాక్ వైఎస్సార్సీపీ' అంటూ అడ్డుకోవడం అన్యాయం. అమరావతి రాజధానిలో  రైతుల భూములు లాక్కుంటూ వారిని అవమానిస్తున్నప్పుడు, వారి సమస్యలను అడ్రస్ చేసే హక్కు వైఎస్సార్సీపీకి ఉంది. ఇలాంటి దాడులకు ఒడిగట్టడం ద్వారా రాజకీయాల్లో ఒక దురదృష్టకరమైన ఆనవాయితీని మొదలుపెడుతున్నారు.  ప్రభుత్వం, డీఎస్పీ, డీజీపీ, సీఐ అంతా తమ వాళ్లే అన్నట్లుగా అధికార పక్షం వ్యవహరిస్తోంది. 
ప్రతి కార్యక్రమానికి పోలీసులను అడ్డుపెట్టుకుని అడ్డుకోవడం ప్రజాస్వామ్య విధానం కాదు.
తప్పు చేసిన వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయకపోతే భవిష్యత్తులో పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. నిజానికి దాడుల వెనుక ఉన్నది రైతులు కాదు. నిరసనలు చేస్తూ, రాళ్లు విసిరిన వారు నిజమైన రైతులు కారు. నిజమైన రైతులైతే తమ బాధలు చెప్పుకుంటారు కానీ, ఇలా అడ్డుకోరు. రైతుల ముసుగులో ఉన్నది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గుండాలే. 'డౌన్ డౌన్ వైఎస్సార్సీపీ' అని అరుస్తూ రాళ్లు విసిరారు కాబట్టే వారిని గుండాలు అంటున్నాం. వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేయడం ద్వారా, అమరావతిలో అవినీతి జరుగుతోందని, అందుకే భయపడి అడ్డుకుంటున్నారని ప్రపంచానికి అర్థమవుతోంది.

రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై జరిగిన ఈ దాడిని సమాజంలోని ప్రజాస్వామ్యవాదులందరూ పార్టీలకి అతీతంగా ఖండించాలి. మేం తగాదా కోసం వెళ్లలేదు. టీడీపీ నేతలు దాడులు చేయవచ్చు, పోలీసులు మాపై కేసులు పెట్టవచ్చు. కానీ అమరావతిలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా మేం సహించం. ప్రజాస్వామ్య విధానంలో దాడులను ఎదుర్కొంటాం. వైయస్సార్సీపీ గొడ్డలి పార్టీ కాదు. చంద్రబాబు గొడ్డలిని నారా లోకేష్ చేతిలో పెట్టి నాటకం ఆడుతున్నాడు. రాష్ట్రంలో ఏ రైతుకు అన్యాయం జరిగినా వైయస్.జగన్ ఆదేశాల ప్రకారం మేం రైతులకు అండగా ఉంటాం.  ఎన్ని దాడులు జరిగినా రైతుల పక్షాన పోరాడుతాం. అక్కడికీ న్యాయం జరగకపోతే మా లీగల్ టీం సహాయంతో రైతులకు అండగా ఉంటూ న్యాయపోరాటం చేస్తాం. టీడీపీ కార్యకర్తలు కానిస్టేబుల్ తల పగలగొట్టారు. దానిపై కేసు పెడతారా? లేదా?, లేదంటే ఆ కేసు కూడా మా పై వేస్తారా? చూడాలి. 

దొంతిరెడ్డి వేమారెడ్డి.మంగళగిరి నియోజకవర్గ ఇన్ ఛార్జి.

మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి లోకేష్ కొందరు జీతగాళ్లను పెట్టుకుని వారి ఆధ్వర్యంలో ఇసుక, మట్టి, లిక్కర్ మాఫియాలను నడిపిస్తున్నారు. మాపై జరిగిన దాడికి కర్త, కర్మ, క్రియ వాళ్లే.రాజధానికి పొలం ఇవ్వలేదనే కక్షతో తమ పొలాల చుట్టూ కందకాలు తవ్వారని పెనుమాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ, పరిశీలనకు రమ్మని పిలిస్తేనే మేమంతా వెళ్లాం.అమరావతి ప్రాంతాన్ని మాయం చేయాలనే లోకేష్ కుట్రలు మేం వెళ్తే ప్రజలకు తెలిసిపోతాయనే భయంతోనే ఉలిక్కిపడి మాపై దాడులు చేయించారు.
రాజధాని నిర్మాణంపై, ఇక్కడి రైతులకిచ్చిన హామీలపై ఎన్నిసార్లు ప్రశ్నించినా ఈ కూటమి ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి సమాధానం లేదు. గతంలో మంగళగిరి నియోజకవర్గంలో ఏనాడూ ఇలాంటి అరాచక సంస్కృతి లేదు; లోకేష్ తన అనుయాయులతో చేయించిన ఈ దాడి అత్యంత దుర్మార్గమైనది.
మాపై దాడులు చేసి భయపెట్టాలని చూస్తే లొంగిపోయేది లేదు; రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను ప్రజల ముందుకు తీసుకురావడాన్ని ఎవరూ ఆపలేరు. పోలీసుల కళ్లముందే రెండు కార్లను ధ్వంసం చేస్తున్నా, రైతులను పరామర్శించడానికి వెళ్తున్నామని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు; ఇదే తీరు కొనసాగితే ప్రజలు త్వరలోనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం.

మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్సీ.

అమరావతి రైతు పరిరక్షణ కమిటీ పేరుతో అమరావతి రైతుల ఆక్రందనలు, బాధలు విన్న వైఎస్ జగన్ వారి రక్షణ కోసం వైయస్సార్సీపీ తరపున ఈ కమిటీని ఏర్పాటు చేశారు. బాధిత రైతుల పిలుపు మేరకు, ముందే ప్రకటించి వారి గ్రామాల్లోని కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు వైయస్సార్సీపీ కమిటీ వెళ్ళింది. పెనుమాక, ఉండవల్లి పర్యటనలో పోలీసుల ముందే టీడీపీ కార్యకర్తలు, మట్టి-ఇసుక మాఫియా ముఠా సభ్యులు రాళ్లు, కర్రలతో దారుణంగా దాడికి తెగబడ్డారు.
మాపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేసిన వారెవ్వరూ అసలు రైతులు కారు; వారంతా మద్యం మత్తులో ఉన్న టీడీపీ గూండాలు, రౌడీ మూకలే.  విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై రాయి వేసి తల పగలగొట్టారు.. ఈ హత్యాయత్నాలకు, విధ్వంసానికి చంద్రబాబు, లోకేష్, స్థానిక డీఎస్పీ, సీఐలదే పూర్తి బాధ్యత. అమరావతిని తమ సొత్తుగా భావిస్తూ దాడులతో భయపెట్టాలని చూస్తే వైయస్సార్సీపీ లొంగదు.. రైతుల బాగు కోసం, ఇచ్చిన హామీల అమలు కోసం కూటమి ప్రభుత్వ మెడలు వంచుతాం. భవిష్యత్తులో అమరావతిలోని ప్రతి ఒక్క రైతును వైయస్సార్సీపీ రైతు పరిరక్షణ కమిటీ ఖచ్చితంగా కలిసి, వారి తరఫున పోరాటాన్ని కొనసాగిస్తుంది.

దేవినేని అవినాష్, వైయస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు.

అమరావతిలో రాజధాని పేరుతో కూటమి ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ, భయపెట్టైనా సరే వారి భూములను లాక్కోవాలని చూస్తోంది. రాజధాని ప్రాంతంలో కూటమి ప్రభుత్వం 'రెడ్ బుక్ రాజ్యాంగం' అమలు చేస్తూ, ప్రజలను మరియు రైతులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. రైతులపై జరుగుతున్న అన్యాయాలపై వైఎస్ జగన్ గారి సూచన మేరకు, వారికి అండగా నిలిచేందుకు వైయస్సార్సీపీలో "రాజధాని పరిరక్షణ కమిటీ" ఏర్పాటైంది. బాధిత రైతులంతా రెండు దఫాలుగా తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి వచ్చి, రాజధాని ప్రాంతంలో తాము పడుతున్న ఇబ్బందులను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.
రైతుల కోరిక మేరకే వారి ఇబ్బందులు తెలుసుకోవడానికి కేవలం పరిరక్షణ కమిటీ, న్యాయవాదుల బృందం మాత్రమే వెళ్తే.. టీడీపీ గూండాలు బరితెగించి దాడులకు తెగబడ్డారు. మట్టి, ఇసుక మాఫియాకు పాల్పడుతున్న అరాచక శక్తులను పోగేసి.. వైయస్సార్సీపీ నేతలపై, వారి కార్లపై కర్రలు, రాళ్లతో దారుణంగా విధ్వంసం సృష్టించారు. కూటమి ప్రభుత్వం చేసే ఇలాంటి దాడులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ భయపడదు; అమరావతి రైతులకు వైఎస్ జగన్, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటారు.

లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ.

రాష్ట్రంలో జరుగుతున్న దారుణ పరిణామాలు చూసి దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు, ప్రజాస్వామ్యవాదులు కూటమి ప్రభుత్వాన్ని ఛీకొడుతున్నారు.
చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని లాకప్ డెత్‌లకు పాల్పడటం అత్యంత ఘోరం. రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ ప్రతినిధి బృందం రైతుల ఆహ్వానం మేరకు పెనుమాక వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరైన పద్ధతి కాదు.
అమరావతిని ప్రపంచంలోనే అద్భుతంగా చేస్తున్నామని గొప్పలు చెప్పే చంద్రబాబుకు.. ఆయన ఇంటికి కూతవేటు దూరంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై జరిగిన దాడులు కనిపించడం లేదా? అమరావతి పేరుతో సాగుతున్న దోపిడీ, అక్రమాలను వైయస్సార్సీపీ ప్రశ్నిస్తుందనే భయంతోనే మా ప్రతినిధి బృందంపై దాడులు చేయించారు. ఇలాంటి బెదిరింపులకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. 
రాజధాని ప్రాంతంలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఏ రైతుకు ఇబ్బంది వచ్చినా వారికి అండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ నిలబడుతుంది.  కూటమి రెండేళ్ల అరాచక పాలనతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారు. మరలా వైఎస్ జగన్  పాలన ఎప్పుడొస్తుందా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు, ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

Back to Top