దేవరపల్లి: ఆగస్టు 5న పొగాకు రైతులకు అండగా మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్‌రెడ్డి దేవరపల్లి మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా దేవరపల్లి గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర మాజీ హోంమంత్రి, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, గోపాలపురం నియోజకవర్గ ఇంచార్జ్ తానేటి వనిత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శుక్రవారం పరిశీలించారు. పర్యటన విజయవంతం కావడానికి చేపడుతున్న ఏర్పాట్లపై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వారు పలు సూచనలు చేశారు. పొగాకు రైతులకు భరోసా కల్పించేలా వైయస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.