కనిగిరి: పీసీపల్లి మండలం, పెద్ద ఇర్లపాడు పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన 12 కుటుంబాల నుంచి 20 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు టీడీపీని వీడి వైయస్ఆర్‌సీపీలో చేరారు. కనిగిరి నియోజకవర్గ వైయస్సార్‌సీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ సమక్షంలో గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమవడం, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడమే టీడీపీ నుంచి నాయకులు, కార్యకర్తలు వైయస్సార్‌సీపీలోకి చేరడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ అన్ని విధాలా అండగా ఉంటామని, అందరం కలిసికట్టుగా పనిచేసి 2029లో వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోపవరపు బొరారెడ్డి, ఓకే రెడ్డి, కటికల వెంకటరత్నం, భూమిరెడ్డి కొండారెడ్డి, చెన్నుపాటి వెంకటరావు చౌదరి, మైల కొండయ్య, మూలే రాజశేఖర్‌రెడ్డి, వాకమల్ల రాజశేఖర్‌రెడ్డి, సూరా మాల్యాద్రి రెడ్డి, తిరుమలపూడి మహేష్, బలసాని యెహోషువ తదితరులు పాల్గొన్నారు.