తాడేపల్లి : విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం (ఐపీఎస్) కుమార్తె మహ్మద్ అఫ్యఫా (24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అఫ్యఫా మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. అఫ్యఫా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుమార్తెను కోల్పోయిన షిరీన్ బేగంతో పాటు కుటుంబ సభ్యులకు శ్రీ వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.