జగన్‌మోహన్‌రెడ్డి అమృత హస్తాలతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఫౌండేషన్‌

భోగాపురం ఎయిర్‌పోర్టు.. నాడు మల్లికార్జునరావు వ్యాఖ్యలివే..

  ‘నా ఫస్ట్‌ ఎయిర్‌పోర్టు హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టు. రాజశేఖరరెడ్డి ఫౌండేషన్‌ వేశారు. మళ్లీ ఆయనే సీఎంగా ప్రారంభోత్సవం చేశారు. మా రెండో ఎయిర్‌పోర్టు ఢిల్లీ ఎయిర్‌ పోర్టు. దానిని కూడా రాజశేఖరరెడ్డి వారితో పాటు వచ్చి ప్రారంభోత్సవం చేశారు. ఈ రోజున అది భగవంతుడు నిర్ణయమో తెలియదు.. వారి తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి అమృత హస్తాలతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఫౌండేషన్‌ వేయడమనేది. వారే దీనిని మళ్లీ ప్రారంభోత్సవం చేయాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను.. 

– జీఎంఆర్‌ చైర్మన్‌ గ్రంథి మల్లికార్జునరావు 2023 మే 3న భోగాపురం ఎయిర్‌ పోర్టు శంకుస్థాపన సభలో చేసిన వ్యాఖ్యలివి.

 

CM YS Jagan Lays Foundation Stone For Bhogapuram Airport Photos - Sakshi2

  శ్రీకాకుళం : ఇది చదివాక ఎవరైనా భోగాపురం ఎయిర్‌ పోర్టు ఘనత మాది అని చెప్పుకోగలరా? కానీ క్రెడిట్‌ చోరీలో పేరు కొట్టేయడంలో సిద్ధహస్తులైన చంద్రబాబు అండ్‌కో.. భోగాపురం ఎయిర్‌ పోర్టు తామే కట్టించామని చెప్పుకోవడం.. ప్రారంభోత్సవం పేరుతో పబ్లిసిటీ చేసుకోవడం చూస్తే ప్రతీ ఒక్కరికీ ఆశ్చర్యం కల్గిస్తోంది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఉన్నప్పుడే మూడింతల నిర్మాణం పూర్తయింది. మిగతా పని కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తయ్యింది. శంకుస్థాపన సమయంలోనే 2026లో ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పారు. శంకుస్థాపనకు ముందే భూసేకరణ పూర్తి చేశారు. అన్ని క్లియరెన్స్‌లు తెచ్చారు. జీఎంఆర్‌తో ఒప్పందం చేసుకుని, శంకుస్థాపన చేశారు. ఇవన్నీ కళ్లముందు కన్పించిన దృశ్యాలే. కానీ భోగాపురం ఎయిర్‌పోర్టు ఘనత తమదని చంద్రబాబు అండ్‌కో చెప్పుకోవడం హాస్యాస్పదంగా మారింది. 

CM YS Jagan Lays Foundation Stone For Bhogapuram Airport Photos - Sakshi4   

ఇదేం ఘనత.. 
 వాస్తవంగా ఎయిర్‌పోర్టుకు భూములు అప్పగించి, అన్ని క్లియరెన్స్‌లు తెచ్చి ఇవ్వడమే ప్రభు త్వం బాధ్యత. మిగతా అంతా జీఎంఆర్‌ చూసుకుంటోంది. ఆ విధంగా జీఎంఆర్‌ చైర్మన్‌ గ్రంధి మల్లికార్జునరావు తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎయిర్‌పోర్టును వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. కానీ, దానిని కూడా తమ ఘనత అని చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకోవడం విస్మయం కల్గిస్తోంది.  

⇒ జీఎంఆర్‌ నిర్మించిన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 2005 మార్చిలో పనులు ప్రారంభిస్తే 2008 మార్చిలో ప్రారంభోత్సవం చేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టు కంటే పెద్దదైన ప్రపంచ స్థాయి గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును 36 నెలల్లో అందుబాటులోకి తెచ్చారు. ఇదంతా 20 సంవత్సరాల క్రితం జరిగింది. కానీ, దానికంటే చిన్నదైన, టెక్నాలజీ పెరిగిన సమయంలో భోగాపురం ఎయిర్‌పోర్టు ఆపరేషన్‌లోకి రావడానికి 33 నెలలు పట్టింది. దీనిలో గొప్పేం ఉంది. భారతదేశంలో ఎన్నడూ జరగని అద్భుతంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది.  

CM YS Jagan Lays Foundation Stone For Bhogapuram Airport Photos - Sakshi6

⇒ సాధారణంగా ప్రైవేటు కంపెనీలు తమ సొంత పెట్టుబడితో నిర్మించే ప్రాజెక్టును ఎంత త్వరగా పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకొస్తే, అంత త్వరగా పెట్టుబడిపై ఆదాయం వస్తుందని ఆత్రుత చూపిస్తాయి. కానీ, కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి, మన ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాత్రం నెలకొకసారి నిర్మాణం జరుగుతున్న భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్లి, తనే దగ్గరుండి కట్టించినట్టు ప్రచారం చేసుకోవడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. 

∙చంద్రబాబు ప్రభుత్వానికి, కేంద్రమంత్రికి అంత సామర్థ్యం, పట్టు ఉంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులను పూర్తి చేయవచ్చు కదా. వేగంగా అందుబాటులోకి రావొచ్చు కదా.. అదేం చేయరు. ప్రైవేటు కంపెనీ ఘనతను తమ ఘనతగా చెప్పుకోవడం చూస్తుంటే క్రెడిట్‌ చోరీ, పబ్లిసిటీ పిచ్చి తప్ప అంతకుమించి ఏమీ లేదని స్పష్టమవుతోంది.   

CM YS Jagan Lays Foundation Stone For Bhogapuram Airport Photos - Sakshi9

కేటాయింపుల మాటేంటి.. 
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం రూ.134.5 కోట్లు, ప్రత్యామ్నాయ రోడ్ల కోసం రూ.7.29 కోట్లు, సబ్‌స్టేషన్‌ కోసం రూ.2.35 కోట్లు, భూ సేకరణకు రూ.967 కోట్లు, ఆర్‌ అండ్‌ ఆర్‌ కు రూ.75 కోట్లు ఇలా మొత్తంగా రూ.1200 కోట్లు పెట్టారు. మరి చంద్రబాబుప్రభుత్వంలో ఏం చేశారో చెప్పగలరా?   

Back to Top