నేడు హైదరాబాద్‌కు వైయ‌స్‌ జగన్ 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జలవిహార్‌ గ్రాండ్‌ లాన్స్‌లో జరిగే సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు.    

Back to Top