తాడేపల్లి: రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి పాపకు, ప్రతి మహిళకు వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధనం ఆత్మీయతలు, అనురాగాలకు ప్రతీకగా నిలిచే పండుగ అని వైయస్ జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి అక్కచెల్లెమ్మకు ఎల్లప్పుడూ అన్ని విధాలుగా మంచి జరగాలని ఆకాంక్షించారు. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని కోరుకుంటున్నట్లు వైయస్ జగన్ తన సందేశంలో తెలిపారు.