రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు విడదల రజిని పరామర్శ

మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

మాజీ మంత్రి విడదల రజిని డిమాండ్‌

పల్నాడు జిల్లా: చిలకలూరిపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి విడదల రజిని పరామర్శించారు. మృతుల భౌతికకాయాలకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జరిగిన ఘటన అత్యంత బాధాకరమని పేర్కొంటూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అండగా నిలవాలని కోరారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆర్థికంగా ఆదుకోవాలని విడదల రజిని డిమాండ్ చేశారు. ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు పూర్తిస్థాయిలో విచారించి, వాస్తవాలను గుర్తించాలని కోరారు.

May be an image of one or more people

గుంటూరు ఆసుప‌త్రిలో నూరి ఫాతిమా ప‌రామ‌ర్శ‌
చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో గాయపడి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరీ ఫాతిమా పరామర్శించారు. వైద్యులను కలిసి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వైయ‌స్ఆర్‌సీపీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ డివిజన్‌ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


 

Back to Top