నేడు  పులివెందులలో  వైయస్‌ జగన్‌ పర్యటన 

 వైయస్‌ ఆనంద్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్న మాజీ ముఖ్యమంత్రి 

తాడేపల్లి:   వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఈ రోజు పులివెందులలో పర్యటించనున్నారు. ఇటీవల మరణించిన వైయస్‌ ఆనంద్‌రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేయనున్నారు.

మధ్యాహ్నం  12.30 గంటలకు పులివెందులకు చేరుకుని వైయస్‌ ఆనంద్‌రెడ్డి గారి అంత్యక్రియల్లో పాల్గొంటారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు.
 

Back to Top