కడపలో డిప్యూటీ మేయర్‌ తండ్రికి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌  నివాళులు 

వైయ‌స్ఆర్ జిల్లా: కడప డిప్యూటీ మేయర్‌ నిత్యానంద రెడ్డి తండ్రి వెంకట సుబ్బారెడ్డి గారి అకాల మరణం పట్ల ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి, బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా , మాజీ మేయర్‌ సురేష్‌బాబు గారు, మాజీ ఆర్టీసీ చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి గారు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వెంకట సుబ్బారెడ్డి గారి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వారు, కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైయస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Back to Top