ప్రజలు ఛీత్కరిస్తున్నా ప్రభుత్వం బుద్ధి మారడం లేదు.. పాలకులకు బుద్ధి రావడం లేదు

రాజకీయ కక్ష సాధింపునకు  ప్రజా స్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగ వ్యవస్థలపై ఒత్తిడి తేస్తారా..?
 
శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజం

విశాఖలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన బొత్స సత్యనారాయణ

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ జగన్ మానవతా దక్పథంతో పరామర్శకు వెళితే ఆంక్షలు విధిస్తారా..?

 కార్యకర్తలు జై జగన్ అంటూ నినదిస్తే మహిళా ఎస్ ఐ పై హత్యాయత్నాం అంటూ కేసు నమోదు చేయడం దుర్మార్గం

 కూటమి ప్రభుత్వ తీరుతో వ్యవస్థల మనుగడుకు ప్రమాదకర సంకేతాలు

   ప్రభుత్వ కుట్రపూరితి బెదిరింపులకు వైెస్సార్ సీపీ కార్యకర్తలు భయపడరు.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటారు

బొత్స సత్యనారయణ  హెచ్చరిక

భోగాపురం ఎయిర్ పోర్టు మొదలుపెట్టినది వైెఎస్ రాజశేఖర్ రెడ్డి  గారు, దాదాపుగా పుర్తి చేసినది శ్రీ వైఎస్ జగన్ గారు

రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టు కోసం ఎయిర్ పోర్టు అథారిటీ ఆప్ ఇండియా అప్పట్లో ప్రభుత్వంతో  చర్చలు జరిపింది

ఆ సమయంలో నేను కేబినెట్ లో ఉన్నా, 2013లో ప్రభుత్వం భోగాపురంను ఎంపిక చేసింది

భోగాపురం ఎయిర్ పోర్టు తన ఆలోచనే అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకోవడం చంద్రబాబు కొత్తేమీ కాదు
  
మాజీ బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ

విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను, చట్టబద్దమై వ్యవస్థలను పూర్తిగా తుంగలోకి తొక్కి కూటమి ప్రభుత్వం తమ ఇష్టారాజ్యంగా  వ్యవహరిస్తోందని శాసన మండలిలో విపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ తీవ్రం స్థాయిలో ధ్వజమెత్తారు.  రాజకీయ కక్షసాధింపే లక్ష్యంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడం, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం ఈ ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసారు.   పాలనా తీరును చూసి ప్రజలు ఎంతలా ఛీత్కరిస్తున్నా సరే ప్రభుత్వం బుద్ధి, పాలకుల  ఏ మాత్రం మారడం లేదని ఆక్షేపించారు. విశాఖపట్నంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ,  మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుపై రాజకీయ కక్షతో తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేసారు. చట్టాన్ని, వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ   ఒక ప్రజాప్రతినిధిని  వేధించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకర సంకేతమని బొత్స ఆవేదన వ్యక్తం చేసారు.  ఈ మీడియా సమావేశంలో బొత్స ఇంకా ఏం మాట్లాడరంటే... 

 నా రాజకీయ జీవితంలో నేనెవర్నీ బెదిరంచలేదు.. నన్నెవరూ బెదిరించలేదు, గవర్నర్ కు లేఖ ద్వారా ఫిర్యాదు చేస్తా 

 శ్రీకాకుళం జిల్లోని అంపోలు జిల్లా జైలు వద్ద శ్రీ జగన్ గారి పర్యటనలో పాల్గొనేందుకు వెళ్తున్న నా పట్ల కూడా 
నాపై కూడా అవమానకరంగా వ్యవహరించారు.  నేను   కేబినెట్ హోదాలో ఉన్నా, మాజీ  మంత్రిగా, బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా పోలీసు అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ నా  వాహనాలను అడ్డుకోవడం అత్యంత అవమానకరమన్నారు.  నేను ఏమీ జగన్ కాన్వాయ్ లో వెళ్లలేదు. రెండు కార్లలో వెళుతున్నారు.  సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులను ఒక వాహనంలో, సిబ్బందిని మరో వాహనంలో తీసుకెళ్తుండగా రెండో వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడం వెనుక ఎలాంటి చట్టబద్ధత లేదు.   జిల్లా ఎస్పీతో మాట్లాడి, తగు సమాచారం ఇచ్చి బయలుదేరాను. అయినా సరే కింది స్థాయి అధికారులు అధికారం దుర్వినియోగం చేసి అడ్డుకున్నారు. ఈ వ్యవహారంను   రాష్ట్ర గవర్నర్‌కు పూర్తి వివరాలతో లేఖ రాసి తద్వారా  ఫిర్యాదు చేయబోతున్నా.   కొన్ని పత్రికలు, ఛానళ్లు జరిగిన సంఘటనలను వక్రీకరించి అసత్య కథనాలు ప్రసారం చేయడం బాధాకరం. వాస్తవాలను రాయకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వార్తలను మలచడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. నేను పోలీసులను  బెదిరించానంటూ  తప్పుడు కొన్ని మీడియాలు తప్పుడు వార్తలు ప్రచురించాయి.   నా  రాజకీయ జీవితంలో నేను  ఎప్పుడూ ఎవరినీ బెదిరించలేదు. నన్ను కూడా ఎవరు బెదిరించలేదు.

 

 మహిళా ఎస్సైపై దాడి అంటూ వక్రీకరించి హత్యయత్నం కేసు పెడతారా..?

వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులను ప్రభుత్వం  ఉపసంహరించుకోవాలి.  జనసందోహంలో మహిళా ఎస్ ఐ చిక్కుకున్నారు. అదే సమయంలో  జై జగన్ అంటూ  నినాదాల హోరు సాగుతోంది. దీంతో సదరు మహిళా ఎస్ ఐ  ఆ శబ్ధాలను భరించలేక చెవులు మూసుకున్నారు. దీనిని కొన్ని మీడియాలు వక్రీకరించి మహిళా ఎస్ ఐ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు దాడి చేసారని ప్రచారం చేసారు. అంతేగాక ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోకుండా  కార్యకర్తలపై కూడా హత్యాయత్నం కేసులు నమోదు చేయడం దారుణం కాదా..?  ప్రజాస్వామ్యంలో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం నేరం కాదు కదా, రాజకీయ వేధింపుల కోసం క్రిమినల్ కేసులను ఆయుధంగా మార్చడం అత్యంత ప్రమాదకర పరిణామం.  ప్రభుత్వ వైఫల్యాలను, అరాచకాలను, దుర్మార్గాలను  ప్రజలు గమనిస్తున్నారు. 
రాష్ట్రంలో చట్టబద్దమైన పరిపాలన క్షీణించింది.  ప్రజాస్వామ్య   వ్యవస్థ లు  స్వతంత్రతను కోల్పోయేలా కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది.   అధికార అహంకారంతో వ్యవహరిస్తూ,  ప్రజల గొంతును అణచివేయాలని ప్రయత్నిస్తోంది. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి బెదిరింపులకు భయపడరు.  ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల పక్షాన పోరాటం సాగిస్తారు. 

 మానవతా దృక్పథంతోనే జగన్ పరామర్శ పర్యటన

 వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి  శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారు  ప్రభుత్వం కక్షపూరితంగా  అన్యాయంగా కేసులో ఇరికించి జైలు పాలు కాబడిన మా పార్టీ నేత  అప్పలరాజును పరామర్శించడానికి రావడం పూర్తిగా మానవతా దృక్పథంతో తీసుకున్న నిర్ణయం.  శ్రీ జగన్ పర్యటనపై ఆంక్షలు విధించిన అంశాన్ని తెలుసుకున్న పార్టీ శ్రేణులు పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఏ మాత్రం ఖాతరు చేయకుండా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమ అభిమాన నాయకుడు శ్రీ  జగన్‌మోహన్ రెడ్డి ని చూసేందుకు తరలివచ్చారు. తమ పార్టీ శ్రేణుల అడుగడుగునా వేలాదిగా తరలి వచ్చినా సరే ఎక్కడా హింస జరగలేదు.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు.  కార్యకర్తలు క్రమశిక్షణతో వ్యవహరించారు.    అయితే ప్రజల ఆదరణను చూసి ఓర్వలేక,  భయపడిన ప్రభుత్వం పోలీసు వ్యవస్థ ద్వారా కక్షసాధింపు చర్యలకు పాల్పడింది.  పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారు. 

 భోగాపురం ఎయిర్‌పోర్టుకు స్వర్గీయ వైయ‌స్సార్ మొదలుపెట్టారు.. జగన్ దాదాపుగా పూర్తి చేసారు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆలోచన తనదేనని  చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకోవడం కొత్తమే కాదు. అయితే వాస్తవానికి  ఈ ప్రాజెక్టు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రారంభమైంది.  అప్పట్లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వంతో చర్చలు జరిపింది. స్వర్గీయ వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో చర్చలు సాగాయి.  2013లో స్థల పరిశీలన పూర్తై భోగాపురం అనువైన ప్రాంతంగా గుర్తించబడింది.  అనంతరం శ్రీ వైఎస్ జగన్ సారథ్యంలో  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూసేకరణ, పునరావాసం, మౌలిక సదుపాయాల కల్పన , కీలక అనుమతులు వంటి కీలక కార్యక్రమాలను వేగవంతం చేసి దాదాపుగా పూర్తి చేసారు. వాస్తవాలను పక్కనపెట్టి మొత్తం ఘనతను ప్రస్తుత ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవడం చరిత్రను వక్రీకరించడమే.  అలాగే ప్రధానమంత్రి మోడీ  పర్యటనను రాజకీయ ప్రచారంగా మార్చొద్దు. ప్రధానమంత్రి రాష్ట్రానికి రావడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారు.  రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే ప్రకటనలు వస్తే అందరూ సంతోషిస్తారు.  ప్రధానమంత్రి పర్యటనను రాజకీయ ప్రచారానికి వేదికగా మార్చి గత ప్రభుత్వాల పాత్రను పూర్తిగా చెరిపివేయడం సమంజసం కాదు. 

 డిఎస్సీ పేరిట 3 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం  

 రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నియామకాలలో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి, లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి స్పష్టమైన చట్టాలు, నిబంధనలు ఉన్నాయని, వాటిని కచ్చితంగా పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.     ముందుగా కొందరికి ఉద్యోగాలు ఇచ్చి, తర్వాత వాటికి చట్టబద్ధత కల్పించేందుకు జీవోలను సవరించడం జరిగింది. జీవో నంబర్ 447 తీసుకొచ్చి నిబంధనలు మార్చి, సుమారు 500 మందికి అనుకూలంగా ఉద్యోగాలు కల్పించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ముందుగా నియామకాలు చేసి, తర్వాత వాటిని సమర్థించేందుకు జీవో మార్చిన ఉదాహరణ చూపించగలరా?"    మెరిట్ ఆధారంగా ఉద్యోగం వస్తే ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారు. కానీ మానిప్యులేషన్ జరిగిందనే అనుమానం వచ్చిన క్షణం మొత్తం వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుంది. లక్షలాది మంది యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే మేము ప్రభుత్వం నుంచి సమాధానం కోరుతున్నాం.    జీవో ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎవరికి ప్రయోజనం కలిగింది? ఏ ప్రమాణాలతో ఎంపికలు జరిగాయి?  అన్న మా ప్రశ్నలకు .  సమాధానం చెప్పకుండా ప్రభుత్వం అసలు అంశాన్ని పక్కదారి పట్టిస్తోంది.

Back to Top