రైతుల పరామర్శకు వెళ్తే దాడులా?

పెనుమాకలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై టీడీపీ మూకల దాడిని రాష్ట్రవ్యాప్తంగా ఖండిస్తున్న నాయకులు

 

 తాడేప‌ల్లి: అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, వారి గోడును తెలుసుకునేందుకు పెనుమాక గ్రామానికి వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ సీఆర్డీయే రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై టీడీపీ మూకలు దాడులకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ప్రజాస్వామ్యబద్ధంగా రైతులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రతినిధులపై రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో దాడి చేయడం దుర్మార్గమని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. రైతుల సమస్యలను వెలుగులోకి రాకుండా చేయడానికే ఈ దాడులు జరిగాయని, ప్రభుత్వం ప్రోత్సాహంతోనే టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. పెనుమాక ఘటన ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

చంద్రబాబు, లోకేష్ కన్నుసన్నల్లోనే దాడులు: గోపిరెడ్డి శ్రీనివాసరెడ్జి, మాజీ ఎమ్మెల్యే

రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ బృందం వెళ్తుంటే ఇవాళ అన్యాయంగా కొంతమంది తాగుబోతుల్ని రోడ్డుపై కూర్చోబెట్టి పోలీసుల సాయంతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇదంతా చంద్రబాబు, లోకేష్ కన్నుసన్నల్లోనే జరిగింది. లోకేష్ తన నియోజకవర్గంలో బెదిరించి లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవర్నీ రాజధాని ప్రాంతంలోకి రానివ్వకూడదని భావిస్తున్నారు. రాజధానిలో జరుగుతున్న విషయాలు అందరికీ తెలుస్తాయని లోకేష్ భయపడ్డారు. రాజధానిలో దోపిడీ తెలిసిపోతుందనే ఎవరినీ అక్కడికి రానివ్వట్లేదు. వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి దిగిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. 

టీడీపీ గూండాలపై హత్యాయత్నం కేసు పెట్టాలి:
పెట్ల ఉమా శంకర్ గణేష్, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే

ఏపీలో రెండేళ్లుగా చంద్రబాబు, లోకేష్ ఆధ్వర్యంలో అరాచక పాలన సాగుతోంది. దీనికి కొనసాగింపుగానే ఇవాళ రాజధానిలో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాలు హత్యాప్రయత్నం చేశారు. పోలీసుల సమక్షంలోనే ఇలా దాడులు సాగడం దారుణం. అధికారం ఉంది కదా అని దాడులు చేయడం దురదృష్టకరం. హామీలన్నీ వదిలేసి దాడులు చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పడం ఖాయం. దాడులు చేసిన టీడీపీ గూండాలపై హత్యాయత్నం కేసులు పెట్టాలి. 

రెడ్ బుక్ దాడుల్ని ప్రజలు గమనిస్తున్నారు:
అలజంగి జోగారావు, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే

మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై టీడీపీ గూండాల దాడిని రాష్ట్ర ప్రజలంతా చూశారు. అమరావతిలో జరుగుతున్న అరాచకాలు, దోపిడీని రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పేందుకు మా నాయకులు వెళ్తే పోలీసుల సమక్షంలోనే దాడులు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన, చంద్రబాబు కుయుక్తుల్ని ప్రజలు గమనిస్తున్నారు. అమరావతి రైతుల సమస్యలు పరిష్కరించకుండా, వారిని కలిసేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేయడం దారుణం. రాబోయే రోజుల్లో కూటమి సర్కార్ అరాచకాలకు తగిన గుణపాఠం చెప్తాం.

మీ అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా ?:
అనంత వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు

రాజధాని పేరుతో అమరావతిలో పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతిని ప్రశ్నించేందుకు రైతులు, రైతు పరిరక్షణ కమిటీ నేతలు, వైఎస్సార్సీపీ బృందం వెళితే టీడీపీ మూకలు దాడులకు పాల్పడ్డాయి. రైతుల ఆహ్వానం మేరకు పొలాలను పరిశీలించేందుకు వెళితే టీడీపీ గూండాలు రాళ్లు, కర్రలతో దాడులు చేయడం ఏంటి ? రైతుల హక్కుల కోసం పోరాడుతున్న వారిపై పోలీసుల సమక్షంలోనే దాడులు చేయడం దుర్మార్గం. అమరావతిలో రైతుల సమస్యలు బాహ్య›ప్రపంచానికి తెలియకుండా చేయడమే లక్ష్యంగా టీడీపీ మూకలు భయభ్రాంతులకు గురిచేశారు. చంద్రబాబు, లోకేష్‌ డైరెక్షన్‌లోనే ఇదంతా జరిగింది. 

దాడులకు చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు:
పీట నాగమోహన కృష్ణ, రేపల్లె ఇన్ ఛార్జ్

పెనుమాకలో రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం భూసేకరణ చేపడుతుంటే వారికి మద్దతు తెలిపేందుకు సీఆర్డీయే పరిరక్షణ సమితితో కలిసి వైఎస్సార్సీపీ నాయకులపై దాడులకు దిగడం హేయమైన చర్య. వైఎస్సార్సీపీ నాయకులతో పాటు పోలీసులపైనా వీళ్లు చేసిన దాడులు చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరికంలో ఉన్నామా అర్దం కావట్లేదు. నాయకులు, పోలీసులపై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. గాయపడిన పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలి. రాబోయే కాలంలో ఇలాంటి దాడులకు చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

అమరావతిలో అవినీతి బాగోతం బయటపెడతాం:
డాక్టర్ అశోక్, అద్దంకి ఇన్ ఛార్జ్ 

రాజధాని ప్రాంతంలో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడి చేస్తుంటే అడ్డుకోవాల్సిన పోలీసులే తమను తాము రక్షించుకోవాల్సి వచ్చింది. భూములివ్వని రైతుల్ని చంద్రబాబు ఎలా ఇబ్బంది పెడుతున్నారో రాష్ట్ర ప్రజలు గమనించాలి. రైతుల భూముల మీద కన్నేసి, వాళ్లకు అండగా నిలబడేందుకు వచ్చిన వారిపై దాడులు చేస్తున్నారంటే ఈ రాష్ట్రం ఎటు పోతుందా అర్దం కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల్ని కలుపుకుని అమరావతిలో అవినీతి భాగోతం బయటపెడతాం. అమరావతి ఏమైనా పాకిస్తాన్ లో ఉందా ?

రెడ్ బుక్ పాలనలో పోలీసులకూ రక్షణ కరవు:
వీరశేఖర్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

రెడ్ బుక్ అనే పిచ్చికుక్క పాలనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులకే కాదు, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. టీడీపీ గూండాల దాడిలో పోలీసులకే తీవ్ర గాయాలయ్యాయి. ఇంత దుర్మార్గమా ? అమరావతి రాజధాని ప్రాంతం ఏమైనా పాకిస్తాన్ లో ఉందా ? అక్కడికి వైఎస్సార్సీపీ వాళ్లు వెళ్లకూడదా? ఏంటీ గూండాయిజం, రౌడీయిజం? అమరావతి ప్రాంతంలో ప్రజల్లో సెంటిమెంట్ ను రగిల్చి పందికొక్కుల్లా దోచుకుతింటున్నారు. ఇంత దుర్మార్గంగా రౌడీయిజం చేస్తూ తిరిగి వైఎస్సార్సీపీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎల్లకాలం రాజకీయం ఇలాగే ఉండదు. 

హోంమంత్రి అనిత రాజీనామా చేయాలి:
పేరం త్రివేణి రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ప్రజాస్వామ్యంలో ఇవాళ చీకటి రోజు. రాజధాని ప్రాంతానికి వెళ్లి రైతుల్ని పరామర్శించడానికి వైఎస్సార్సీపీ నేతలు వెళ్తే దాడులకు దిగుతారా ? రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు అమల్లో ఉన్నాయా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. హోంమంత్రి అనితకు తన శాఖలో ఏం జరుగుతుందో తెలుస్తుందా ? వైఎస్సార్సీపీ శ్రేణుల మీద రాళ్ల దాడులు చేస్తూ టీడీపీ గూండాలు భయానక వాతావరణం సృష్టించారు. రైతుల కోసం మా పార్టీ నాయకులు పోరాటం చేసే హక్కు లేదా ? ఈ దాడికి కారణమైన టీడీపీ గూండాల్ని వెంటనే అరెస్టు చేయాలి. శాంతి భద్రతల్ని కాపాడలేని హోంమంత్రి అనిత తన పదవికి రాజీనామా చేయాలి. 

చంద్రబాబు ప్రేమ రాజధానిపైనే, రైతులపై కాదు:
అవుతు శైలజారెడ్డి, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ 

రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనలో ప్రజలు విసుగెత్తిపోయారు. ఉండవల్లి ప్రాంతంలో అమరావతి రైతుల్ని పరామర్శించి, వారి ఇబ్బందులు తెలుసుకోవడానికి వెళ్తే.. వాస్తవాలు తెలుస్తాయనే భయంతో టీడీపీ గూండాలు కోడిగుడ్లతో, రాళ్లతో దాడులకు దిగారు. చంద్రబాబు రాజధానిలో ఇలాంటి పరిస్ధితులు తీసుకురావడం సిగ్గుచేటు. అధికారంలో ఉన్న చంద్రబాబుకు చేతకాకపోతే, జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు తమ సమస్యలు చెప్పుకున్నారు. రైతుల ఆందోళన చంద్రబాబుకు పట్టదా ? ఆయనకు రాజధానిపై ప్రేమ ఉంది కానీ అక్కడి రైతులపై మాత్రం ప్రేమ లేదు.  వైఎస్సార్సీపీ కమిటీ రాజధానికి వెళ్తే ఏమవుతుంది ? 

రైతులతో కలిసి పోరాటానికి సిద్దం:
పసుపులేటి సురేష్, వైఎస్సార్సీపీ స్టేట్ మీడియా ప్యానలిస్ట్

పెనుమాకలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ గూండాల దాడి వెనుక చంద్రబాబు హస్తం ఉంది. అమరావతిలో ప్రభుత్వ బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే రైతులు జగన్మోహన్ రెడ్డిని కలిసి మొరపెట్టుకున్నారు. రైతుల ఆవేదన వెనుక ఉన్న వాస్తవాల్ని తెలుసుకునేందుకు వెళ్తుంటే దాడులకు దిగడం ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటు. అమరావతిలో దోపిడీ, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు రాష్ట్రానికి తెలియకుండా దాడులు చేశారు. రైతులతో కలిసి పోరాటాలు చేసి మీ అవినీతిని బట్టబయలు చేస్తాం. 

అమరావతికి ఇంకెవరూ రాకుండా దాడులు:
కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర అధికార ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ లో ఆటవిక పాలన కొనసాగుతోంది. అరాచక శక్తులు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. అమరావతిలో జరిగిన దాడి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా ? ఆప్ఘనిస్తాన్ లో ఉన్నామా అర్దం కావడం లేదు. అమరావతిలో అక్రమాలు తెలుసుకునేందుకు ఇంకెవరూ రాకుండా ఉండేలా ఈ దాడులు చేశారు. రైతులు దాడులు చేశారని దుష్ప్రచారం చేస్తున్నారు. రైతుకు పంటలు పండించడమే తెలుసు, ఇలాంటి కసాయిపనులు చేయడం తెలియదు. 

రోజులన్నీ ఒకేలా ఉండవన్న విషయం గుర్తుపెట్టుకోండి:
నాగమల్లీశ్వరి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ శాంతిభద్రతల్ని పూర్తిగా దిగజార్చారు. వైఎస్సార్సీపీ నేతల మీద ఇవాళ జరిగిన దాడి హోంమంత్రి అనితకు కనిపించలేదా ? కావాలంటే చెప్పండి దాడి విజువల్స్ కూడా మీకు పంపిస్తాం. మీ హవా ఎల్లకాలం సాగదని గుర్తుపెట్టుకోండి. ఈ రౌడీ, గూండా రాజకీయానికి చెక్ పెట్టే రోజు దగ్గర్లోనే ఉంది. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఈ దాడి చేసిన వారిని కోర్టు ముందు నిలబెడతాం. మీరు వీళ్లని వదిలేసినా జగనన్న మాత్రం భవిష్యత్తులో వదిలిపెట్టరు.

రైతును గౌరవించలేని ప్రభుత్వం రాజధాని నిర్మిస్తుందా  ?
జమ్మలమడక నాగమణి, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు 

ఉండవల్లిలో జరిగిన దాడి సాధారణమైన ఘటన కాదు. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. అమరావతిలో దోపిడీ, రైతులకు జరుగుతున్న అన్యాయం తెలుసుకునేందుకు వెళ్తే దాడులు చేస్తారా ? వైఎస్సార్సీపీ నేతల పర్యటనతో వాస్తవాలు బయటికి వస్తాయనే ఈ దాడి చేశారు. చంద్రబాబుకు అమరావతి అంటే రైతు గుర్తుకురావడం లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కటే గుర్తుకొస్తోంది. రైతుకు గౌరవం ఇవ్వలేని ప్రభుత్వం రాజధాని నిర్మించగలదా ?

ఉండవల్లి ఘటన ప్రజాస్వామ్యంపై టీడీపీ దాడి:
వడ్డీ రఘురాం నాయుడు, వైఎస్సార్సీపీ నేత 

ఉండవల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, సీఆర్డీయే రైతు పరిరక్షణ కమిటీ ప్రతినిధులపై టీడీపీ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రైతు సమస్యలపై మాట్లాడేందుకు  వెళ్లిన ప్రతిపక్ష నాయకులపై రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేయడం టీడీపీ అసహన రాజకీయాలకు నిదర్శనం. ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన దాడేనని స్పష్టంగా కనిపిస్తోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దాడి వెనుక ప్రభుత్వ కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్ని దాడులు, బెదిరింపులు చేసినా రైతుల పక్షాన మా పోరాటం ఆగదు.

రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటమే:
రమేశ్ గౌడ్, బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్

రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అమలు చేస్తూ ప్రశ్నించే గొంతుల్ని నొక్కేస్తున్నారు. ముందు నుంచీ చంద్రబాబు అంటే రైతులంటే చిన్నచూపు. ఇప్పుడు రాజధానిలోనూ భూములివ్వని రైతులపై కక్షసాధిస్తూ గూండాల్ని పెట్టి బెదిరిస్తున్నారు. ఇవాళ మా పార్టీ నేతలపై దాడులు చేసిన వారిపై ఇప్పటివరకూ కేసులు నమోదు చేయలేదు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలుస్తారనే అంశం ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. రైతులకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ నిద్రపోదు.

Back to Top