తడిగుడ్డతో గొంతులు కోసే దుర్మార్గుడు చంద్రబాబు:

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్

తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.

చంద్రబాబు రెండేళ్లలో చేసిన అభివృద్దేం లేదు

వైఫల్యాలను డైవర్ట్ చేయడానికే వ్యక్తిగత దాడి

తల్లిదండ్రులను పట్టించుకోని నీకు కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడే హక్కుందా?

సూటిగా నిలదీసిన అంబటి రాంబాబు

పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ కట్టుకథలే.

సాయికృష్ణ మృతిపై సీబీఐ దర్యాప్తు జరగాలి.

మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్.

తాడేపల్లి : తల్లిదండ్రులను,తోడబుడ్డిన చెల్లెళ్లను  పట్టించుకోని సీఎం చంద్రబాబు నాయుడికి కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు ఏమాత్రం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు తడిగుడ్డతో గొంతు కోసే నీచుడని, అధికారం కోసం ఏ గడ్డి కరవడానికైనా సిద్దపడతాడని తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు, సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే.. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వైయస్.జగన్‌పై చంద్రబాబు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు.మరోవైపు సాయికృష్ణ మృతి విషయంలో పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు, కట్టుకథలు చెబుతున్నారని విమర్శించిన ఆయన.. ఈ లాకప్ డెత్ పై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని, అలాగే పోలీస్ స్టేషన్లపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..

"ప్రస్టేషన్‌లో చంద్రబాబు.. దమ్ముంటే పులివెందుల వెళ్లి చూడు!"

"వైయస్.జగన్ గారిని దూషించడం ద్వారా ఏదో ఒక లబ్ధి పొందాలన్న తాపత్రయం తప్ప చంద్రబాబుకు మరొక్కటి లేదు. తాను రాష్ట్రానికి, ప్రజలకు చేసిన మంచి కార్యక్రమాలేవీ లేకపోవడం వల్లనే.. వైయస్.జగన్‌ని తప్పుడు వ్యక్తిగానూ, వైయస్సార్సీపీని తప్పుడు పార్టీగా చిత్రీకరించడానికి ఆయన విపరీతమైన తాపత్రయం పడుతున్నారు. ఇన్నేళ్లు కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు ఒక్కసారి పులివెందుల వెళ్లాలి. వైయస్.రాజశేఖర్ రెడ్డి, వైయస్.జగన్‌లు పులివెందుల నియోజకవర్గానికి ఎంత సేవ చేశారో, అభివృద్ధి పథంలో ఆ నియోజకవర్గ రూపురేఖలను ఏ విధంగా మార్చారో చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఒకవైపు ప్రజల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న గ్రాఫ్, మరోవైపు రోజురోజుకూ పతనావస్థకి చేరుతున్న తెలుగుదేశం పార్టీని చూసి చంద్రబాబు తీవ్రమైన ప్రస్టేషన్‌కి లోనవుతున్నాడు. ఆ విషయం అందరికన్నా చంద్రబాబుకే బాగా తెలుసు. ఇక 'మావిగన్' అన్న తర్వాత చంద్రబాబుకి నిద్ర కూడా పట్టడం లేదు. రానున్న ఎన్నికల్లో అమరావతి, మావిగన్.. ఈ రెండింటి మధ్యే అజెండా ఉంటుందని వైయస్.జగన్ స్పష్టం చేసిన తర్వాత ప్రస్టేషన్ మరింత పీక్‌కి చేరడంతో చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు."

కుటుంబం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు..

"ఎన్టీఆర్ కుమార్తెను వివాహం చేసుకుని,  రాజకీయంగా ఎదిగిన తర్వాత.. చంద్రబాబూ, మీరు ఎప్పుడైనా మీ తల్లిదండ్రులను ఎవరికైనా చూపించారా? వారిని హైదరాబాద్ పిలిపించి భోజనం పెట్టి ప్రేమగా పలకరించారా? తల్లిదండ్రులు చనిపోతే పెద్ద కుమారుడు గుండు చేయించుకుని అంతిమ సంస్కార కార్యక్రమాలు చేస్తారు. మీరు చేశారా చంద్రబాబూ? చివరికి హైదరాబాద్‌లో మీ తల్లి పేరుమీద ఉన్న ఖరీదైన భూమిని సైతం మీ కుమారుడి పేరు మీద రాయించుకున్నారు. మీకు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వారికి ఎప్పుడైనా మీరు కనీసం చీర పెట్టారా? మీకు ఇవాళ రూ.1.30 లక్షల కోట్ల ఆస్తులున్నాయని మీ అఫిడవిట్‌లో ఉంది. మీ ఆస్తుల్లో వారికి వాటాలిచ్చారా? లేదు సరికదా.. చివరకు మీ అమ్మగారి పేరు మీద ఉన్న భూమి కూడా మీరే రాయించుకున్నారు. అలాంటి మీరు ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు. నేను రాజకీయాలు చేస్తాను, హత్యలు చేయను అని అంటున్నారు. చంద్రబాబూ నువ్వు తడిగుడ్డతో గొంతులు కోసే దుర్మార్గుడివి. పదవి కోసం ఎన్టీఆర్‌ని సైతం వెన్నుపోటు పొడిచిన దుర్మార్గమైన రాజకీయాలు చేసిన వ్యక్తివి నువ్వు. పవర్ కోసం ఏ గడ్డి అయినా కరిచే స్వభావం కలిగిన నువ్వు ఇవాళ సూక్తులు చెబుతున్నావా?"

"డైవర్షన్ పాలిటిక్స్.. సొంత తమ్ముడికే సంకెళ్లు వేయించిన చరిత్ర నీది"

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మా మీద రోజూ ఏదో ఒక అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అత్యంత దౌర్భాగ్య స్థితిలో ఉంది. పోలీస్ స్టేషన్లలో లాకప్ డెత్‌లు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్లపై దాడులు చేసే సంస్కృతి వచ్చింది. వీటితో పాటు 'మావిగన్' అంశాన్ని కూడా డైవర్ట్ చేయడానికే చంద్రబాబు వైయస్.జగన్ మీద దూషణకు దిగాడు. ఇది చాలా దురదృష్టకరం. తల్లిదండ్రులకు కనీస దినవారాలు చేయని వ్యక్తి మీరు. మీ కుటుంబ సమస్యలు ఇవి. కానీ మీరు మాత్రం నిరంతరం వైయస్.జగన్ కుటుంబ అంశాలే మాట్లాడుతున్నారు. మంత్రి లోకేష్‌కి ఒక బాబాయి, మీకు ఒక తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు ఉన్నారు. మీ పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేసిన మాట వాస్తవం కాదా? చివర్లో ఆయనకు సంకెళ్లు కూడా వేశారు. అలాంటి నువ్వు కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడ్డం విడ్డూరంగా ఉంది. రా చంద్రబాబూ.. నీ కుటుంబమేంటో, వైయస్.జగన్ కుటుంబమేంటో తేల్చుకుందాం. ఎన్టీ రామారావు కుమార్తెని పెళ్లి చేసుకున్న తర్వాత నీ కుటుంబాన్ని, తల్లిదండ్రులను గాలికి వదిలేసి హైదరాబాద్‌లో తిరిగిన నీకు కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.

(అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానంగా...)

చంద్రబాబుది  తడిగుడ్డల పార్టీ!"
"గొడ్డలి పార్టీ అని మమ్మల్ని విమర్శిస్తున్న చంద్రబాబుది తడిగుడ్డల పార్టీ. నమ్మించి గొంతు కోయడం చంద్రబాబు నైజం. ఆయన ఎవరి గొంతైనా కోస్తే పోస్ట్‌మార్టమ్‌లో కూడా దొరకడు. అంత నమ్మించి గొంతు కోయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. రాష్ట్రంలో రౌడీ పార్టీ ఎవరిది? అమరావతి రైతుల పరామర్శకు వెళ్తే మా కార్లు పగలగొట్టారు. నా ఇంటిపై దాడి చేశారు. చివరకు పోలీస్ స్టేషన్లపై కూడా దాడులు చేస్తున్నారు. ఎవరిది రౌడీ పార్టీ? లాకప్‌లో పెట్టి చంపేస్తున్నారు, అడిగితే మమ్మల్ని రౌడీలు అంటున్నారు. మీ అంత దుర్మార్గమైన, దారుణమైన హత్యలు చేసే పార్టీ మరొకటి లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. రెండేళ్లలో మీరు చేసిందేమీ లేదు. వైయస్.జగన్ మీద, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలతో ఎల్లకాలం పాలన సాగించలేరు. ప్రజలు మీకిచ్చిన సమయం ముగిసింది. మీరు ఇచ్చిన వాగ్దానాలకు కాలం చెల్లింది. నీ కుటుంబం గురించి ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకో చంద్రబాబూ. నీ తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకం చదివితే నీ నైజం తెలుస్తుంది. చంద్రబాబు కంటే నీచమైన, నైతిక విలువలు లేని వ్యక్తి భారతదేశ రాజకీయాల్లో మరొకరు లేరు. అమరావతిలో పెద్ద ఇల్లుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు ఆ కార్యక్రమానికి తన చెల్లెళ్లను పిలిచాడా? ఏం లోకేష్.. మీ మేనత్తలను పిలిచావా? కనీసం చీరలైనా పెట్టావా? లేదు. మీరు ఇతరుల కుటుంబాల గురించి మాట్లాడాతారా? కుటుంబ వ్యవస్థ మీద నమ్మకం లేని చంద్రబాబూ.. మరోసారి వైయస్.జగన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే మీ బండారం మరింత బయటపెట్టడం ఖాయం."

"సాయికృష్ణ మృతిపై సీబీఐ విచారణ జరగాలి.. 
నిందితులను వదిలేసి కులాల ప్రస్తావన తెస్తారా?"

"సాయికృష్ణ విషయంలో పవన్ కళ్యాణ్ కట్టుకథలు చెబుతున్నాడు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. సాయికృష్ణ తల్లి స్వయంగా, తన కుమారుడు పవన్ కళ్యాణ్ అభిమాని అని చెబుతూ.. అంత్యక్రియల కోసం దోసెడు బూడిద ఇమ్మని అడిగితే సమాధానం చెప్పడం లేదు. సాయికృష్ణ తల్లి కూడా తమను చంపేస్తారన్న భయాన్ని వ్యక్తం చేసిందంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ కేసులో నేరస్థుడిగా అరెస్టైన సీఐ నాగరాజు కూడా తనను చంపేసే ప్రమాదముందని చెబుతున్నాడు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇంత జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు 'సీఐ కాపు, సాయికృష్ణ కాపు' అని కులాల ప్రస్తావన తేవడం సిగ్గుచేటు. లా అండ్ ఆర్డర్ పరిరక్షణ మాని, ప్రజలను గాలికొదిలేసి నిత్యం వైయస్.జగన్ మీద తప్పుడు ప్రచారం మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా సాయికృష్ణ మృతిపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేయాలి."

పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తున్నా కేసులు లేవు..

"యూట్యూబర్ రావణ్‌ను తమకు అప్పగించాలని జనసేన కార్యకర్తలు నేరుగా పోలీస్ స్టేషన్లపైనే దాడులకు దిగుతున్నారు. పోలీసులను నెట్టేస్తున్నారు. అయినా వారి పైన ఎలాంటి కేసులు ఉండవు. ఇది ఈ ప్రభుత్వ దుర్మార్గం. మీరు చేస్తున్న ఈ అరాచకాల అన్నింటికీ కచ్చితంగా బదులు అనుభవించక తప్పదని అంబటి రాంబాబు హెచ్చరించారు.

Back to Top