అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ముందస్తు అనుమతుల వల్లే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ఈ రోజు (శుక్రవారం) ప్రారంభమయ్యాయంటూ జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్’లో చేసిన పోస్టుకు స్పందిస్తూ జిందాల్ తిరిగి పోస్టు పెట్టారు. మీ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ముందస్తు అనుమతులు, నిరంతర కృషి వల్లే ఈ రోజు ఈ కార్యక్రమం జరిగిందని ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంత యువత, కుటుంబాల కోసం ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు.