వైయ‌స్‌ఆర్ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

 ఇడుపులపాయలో మహానేత వర్ధంతి కార్యక్రమం..

ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వైయ‌స్‌ జగన్‌

వైయ‌స్‌ఆర్ జిల్లా: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఘన నివాళులర్పించారు. బుధవారం ఉదయం ఇడుపులపాయలోని వైయ‌స్‌ఆర్ ఘాట్‌ వద్ద తండ్రి సమాధికి నివాళులర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైయ‌స్‌ఆర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు మహానేతకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. 

Back to Top