తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ సెప్టెంబర్ 3న కర్నూలులో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు కర్నూలు చేరుకోనున్న ఆయన సెయింట్ జోసెఫ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగే కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్.వి. మోహన్‌రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం శ్రీ వైయస్ జగన్ కర్నూలు నుంచి తిరుగు ప్రయాణమవుతారు.