వైయస్ఆర్ కడప జిల్లా: రెండు రోజుల పర్యటనలో భాగంగా పులివెందుల చేరుకున్న వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి భాకరాపురం క్యాంప్ కార్యాలయం వరకు దారిపొడవునా పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలను పలకరిస్తూ వైయస్ జగన్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో వైయస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఆయనను కలిశారు. ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుంటూ, వారి విజ్ఞప్తులను స్వీకరించారు. పులివెందుల పర్యటనలో భాగంగా ప్రజలు, పార్టీ శ్రేణులతో వైయస్ జగన్ మమేకమయ్యారు.