మరపురాని మహానేత.. జలప్రదాత వైయ‌స్‌ఆర్

నేడు వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి

 తాడేపల్లి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన జలయజ్ఞం ఒక పథకం కాదు.. కోట్లాది మంది రైతన్నల బతుకులకు కొత్త ఊపిరి. కాలువల ద్వారా జలసిరులు పారించి.. కరువును తరిమేసిన అపర భగీరథుడు వైయ‌స్‌ఆర్‌. నీటి చుక్కతో నవ్య చరిత్ర రాసిన జలప్రదాత వైయ‌స్‌ఆర్‌కు 17వ వర్ధంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ ఘన నివాళులు అర్పించింది. ‘మరపురాని మహానేత.. జలప్రదాత డాక్టర్‌ వైయ‌స్‌ఆర్‌’ అంటూ వైయ‌స్ఆర్‌సీపీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేసింది.

వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సెప్టెంబర్‌ 2న ఉదయం పులివెందులలోని తన నివాసం నుంచి బయలుదేరి ఉదయం 7.45 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైయ‌స్‌ఆర్‌ ఘాట్‌ వద్ద డాక్టర్‌ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు.

తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం డాక్టర్‌ వైయ‌స్‌ఆర్‌ 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేత వైయ‌స్‌ఆర్‌కు ఘన నివాళులు అర్పించనున్నారు. 

Back to Top