గ్రేటర్‌ విశాఖ నేతలతో రేపు శ్రీ వైయ‌స్‌ జగన్‌ సమావేశం

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌ రేపు (23.09.2026) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్‌ విశాఖపట్నంకు చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

ఈ సందర్భంగా జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్‌ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై నేతలు, కార్యకర్తలతో శ్రీ వైయ‌స్‌ జగన్‌ చర్చించనున్నారు.
 

Back to Top