అక్రమ కేసులకు తలొగ్గే ప్రసక్తే లేదు

ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి

నెల్లూరు: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు, అవినీతి జరిగాయనేది వాస్తవమని ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, నియామక ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అక్ర‌మ కేసుల‌కు త‌లొగ్గే ప్ర‌స‌క్తే లేద‌ని, డీఎస్సీ అవకతవకలపై వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని స్పష్టం చేశారు.

శాంతియుత నిరసనపై దాడులు ఎందుకు?

“నిన్న విజయవాడ శాప్ కార్యాలయం కేంద్రంగా వైయ‌స్ఆర్‌సీపీ శాంతియుత నిరసన చేపట్టింది. యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై టీడీపీ గుండాలతో దాడులు చేయించారు. టీచర్లను ముందుపెట్టి టీడీపీ ఆడిన డ్రామా హేయమైనది. నిన్న జరిగిన దాష్టీకాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారు.”

 అక్రమ కేసులకు తలొగ్గేది లేదు

“శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై దాడులు చేయించి, ఇప్పుడు గాయపడిన వారిపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దాడులు, కేసులతో వైయ‌స్ఆర్‌సీపీ ఉద్యమాన్ని అడ్డుకోలేరు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలపై వాస్తవాలు బయటకు వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. అక్రమ కేసులకు తలొగ్గే ప్రసక్తే లేదు.”
 

Back to Top