డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం గంగలకుర్రు, గుంటమామిడి తోట గ్రామాల్లో వినాయక విగ్రహ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా వివాదం చోటుచేసుకుంది. గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న వినాయక నిమజ్జన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు భక్తిశ్రద్ధలతో మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్తుండగా, అదే గ్రామానికి చెందిన కూటమి ప్రభుత్వానికి చెందిన వారు ఊరేగింపును అడ్డుకుని దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారని వైయస్ఆర్‌సీపీ నేతలు తెలిపారు. ఈ ఘటనలో కొందరికి గాయాలు కావడంతో వారు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే పోలీసులు వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని పార్టీ నేతలు పేర్కొన్నారు. బాధితులను పరామర్శించేందుకు, పరిస్థితిని తెలుసుకునేందుకు పి.గన్నవరం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, అంబాజీపేట మండల పార్టీ అధ్యక్షుడు విత్తనాల ఇంద్రశేఖర్, అయినవిల్లి మండల అధ్యక్షుడు మెడిశెట్టి శ్రీనివాసరావు తదితరులు అంబాజీపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. వాసంశెట్టి తాతాజీ, కాండ్రేగుల శ్రీనివాసరావు, దేవరపల్లి గౌతమ్, మట్టపర్తి హరి, గోసంగి కుమార్‌స్వామి, దొమ్మేటి నాగన్న, కొప్పిశెట్టి రాంబాబు, రాయుడు షణ్ముఖ్, దొమ్మేటి సుధాకర్, కాండ్రేగుల శ్రీనివాస్, సంసాని మురళి, మట్టపర్తి రమేష్, పితాని సత్తిబాబు, చప్పిడి పండు, మట్టపర్తి విజయ్, దొమ్మేటి రాము, కుడుపూడి రాజేష్, కుడుపూడి వెంకన్న, కాండ్రేగుల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి, గాయపడిన బాధితులకు న్యాయం చేయాలని వైయస్ఆర్‌సీపీ నేతలు కోరారు.