తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కమిటీలో ఇద్దరు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ అధినేత శ్రీ వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీలో వివిధ హోదాల్లో నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి చెందిన గుంటూరి పెద్దిరాజును రాష్ట్ర కార్యదర్శిగా (పార్లమెంట్) నియమించారు. అలాగే కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన అంగూరి లక్ష్మీ శివకుమారిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. పార్టీ రాష్ట్ర కమిటీలో బాధ్యతలు స్వీకరించిన నూతన కార్యదర్శి, అధికార ప్రతినిధికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.