కాకుమాను రాజశేఖర్‌ భౌతికకాయానికి నివాళి

 పార్టీ జెండా కప్పి ఘనంగా నివాళులర్పించిన వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య నేతలు

ఒంగోలు: వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్‌ భౌతికకాయానికి పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ తదితరులు రాజశేఖర్‌ భౌతికకాయంపై వైయ‌స్ఆర్‌సీపీ జెండా కప్పి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రాజశేఖర్‌ పార్టీకి అందించిన సేవలను నేతలు స్మరించుకున్నారు. ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్‌, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కె.పి. నాగార్జునరెడ్డి, ఒంగోలు ఇన్‌చార్జ్‌ చుండూరి రవి, కనిగిరి ఇన్‌చార్జ్‌ దద్దాల నారాయణయాదవ్‌ తదితరులు రాజశేఖర్‌ భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Back to Top