అంబటి రాంబాబుపై మ‌రో అక్ర‌మ‌ కేసు 

14 రోజుల్లో విచారణకు హాజరు కావాలని పోలీసుల నోటీసులు

గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల వేళ గుంటూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పార్టీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఏప్రిల్‌లో తన ఇంటిపై దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేసిన టీడీపీకి చెందిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట దీక్ష నిర్వహించారు.

ఈ దీక్ష నిర్వహించినందుకు అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సమాచారం. తాజాగా పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న 14 రోజుల్లోపు పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. తమ ఇంటిపై జరిగిన దాడికి బాధ్యులైన వారిపై చర్యలు కోరినందుకు కేసు నమోదు చేయడంపై వైయ‌స్ఆర్‌సీపీ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Back to Top