తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా ఫయాజ్‌ బాషా

జేసీ బెదిరింపులకు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు భయపడవు

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

అనంతపురం: తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థిగా ఫయాజ్‌ బాషా పోటీ చేస్తారని పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నామినేషన్లు వేస్తే అంతుచూస్తామని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి బెదిరిస్తున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు భయపడబోవని స్పష్టం చేశారు. జేసీకి వత్తాసు పలుకుతున్న అధికారులు, పోలీసులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదని, అధికార దుర్వినియోగానికి తప్పకుండా ప్రతిఫలం ఉంటుందని వ్యాఖ్యానించారు. వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ఎవరు పోటీ చేయాలి, ఎవరు చేయకూడదనే విషయాన్ని పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని కేతిరెడ్డి పేర్కొన్నారు. ఫలానా వ్యక్తి పోటీ చేయకూడదని చెప్పడానికి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎవరు అని ప్రశ్నించారు.

Back to Top