ప్రొద్దుటూరు: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వైయస్ఆర్సీపీ అభ్యర్థులను ప్రకటించింది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోరెడ్డి నరసింహారెడ్డిని ఖరారు చేయడంతో పాటు, 52 వార్డుల్లో పోటీ చేయనున్న కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలను వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల్లోకి వెళ్లాల్సిన విధానం, పార్టీ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో సమష్టిగా పనిచేస్తూ పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులతో పాటు వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.