కలాం ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ నివాళి

తాడేపల్లి: భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. విద్యతో వ్యక్తి ఎదుగుదల, యువశక్తితో దేశాభివృద్ధి సాధ్యమని నమ్మిన గొప్ప దార్శనికుడు కలాం అని కొనియాడారు.

“కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి” అనే సందేశంతో విద్యార్థులకు స్ఫూర్తినిచ్చిన కలాం నిరాడంబర జీవితం, దేశాభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి, అబ్దుల్‌ కలాం కలిసి ఉన్న ఫొటోను వైయస్‌ జగన్‌ తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

Image

Back to Top