శృంగవరపుకోటలో టీడీపీకి షాక్‌

మాజీ సర్పంచ్‌ సంగం గోవింద్‌తో పాటు 150కు పైగా కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక

విజయనగరం జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల వేళ విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. లక్కవరపుకోట మండల మేజర్‌ పంచాయతీ మాజీ సర్పంచ్‌ సంగం గోవింద్‌తో పాటు 150కు పైగా కుటుంబాలు టీడీపీని వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, సోషల్‌ మీడియా అధ్యక్షుడు యడ్ల కిషోర్‌, మాజీ సర్పంచ్‌ జామి అప్పలరాజు, తూర్పాటి శివాజీ, మాజీ సర్పంచ్‌లు ఏడువాక రాజా కిషోర్‌, కొట్యడ మహేష్‌, మండల యువజన విభాగం అధ్యక్షుడు తూర్పాటి అప్పలరాజుతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Back to Top