కిర్లంపూడి: ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామానికి చెందిన ప్రముఖ నాయకుడు అడపా పార్థసారథి తిరిగి వైయస్ఆర్సీపీలో చేరారు. కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఇన్చార్జి ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గిరిబాబు పార్టీ కండువా కప్పి పార్థసారథిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అడపా పార్థసారథి మాట్లాడుతూ, వైయస్ఆర్సీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఏలేశ్వరం మండలంతో పాటు ప్రత్తిపాడు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. ముద్రగడ గిరిబాబు నాయకత్వంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అడపా పార్థసారథి తిరిగి పార్టీలో చేరడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని నాయకులు తెలిపారు. నాయకులు, కార్యకర్తల సమన్వయంతో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.