మహాగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వైయ‌స్‌ జగన్‌ నివాళి

 తాడేపల్లి : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు ఘన నివాళులర్పించారు. తన అద్భుతమైన గాత్రంతో పాటకు ప్రాణం పోసి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహాగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని పేర్కొన్నారు. తెలుగుతో పాటు అనేక భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన తెలుగు జాతికి గర్వకారణమని వైయ‌స్‌ జగన్‌ తెలిపారు.

Image

Back to Top