స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయకేతనం ఎగురవేస్తుంది

 కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యం.. కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుంది

ముమ్మిడివరం:  పల్లిపాలెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో  వైయ‌స్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులకు పార్టీ ఐడీ కార్డులు అందజేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయకేతనం ఎగురవేస్తుందని పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తూ అభ్యర్థుల ఎంపిక చేపడతామని, కార్యకర్తలు, నాయకుల ఆదరణ ఉన్న అభ్యర్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.

మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్, సర్పంచ్, ఎంపీటీసీ తదితర స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతి ఒక్కరూ తమ సొంత ఎన్నికలుగా భావించి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పితాని బాలకృష్ణ మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాస్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాశీ బాలమణి కుమారి, రాష్ట్ర, జిల్లా నాయకులు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Back to Top