తాడేపల్లి : మాజీ లిడ్‌క్యాప్ ఛైర్మన్, వైయస్ఆర్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మరణంపై వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం గుండెపోటుతో రాజశేఖర్ ఆకస్మికంగా మృతి చెందడం తీవ్రంగా బాధించిందని తెలిపారు. వైయస్ఆర్‌సీపీకి రాజశేఖర్ అంకితభావంతో సేవలందించారని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించారని గుర్తుచేసుకున్నారు. గతంలో లిడ్‌క్యాప్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆయన, ప్రస్తుతం పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. (File Photo) రాజశేఖర్ ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటని వైయస్ జగన్ పేర్కొన్నారు. పార్టీ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. రాజశేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు. కాకుమాను రాజశేఖర్ కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.