డీఎస్సీ–2025 అక్రమాలపై నారా లోకేష్‌ రాజీనామా చేయాలి

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ట్వీట్‌

విజయవాడ:  డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. శాప్‌ వద్ద దాడిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అనంత‌రం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

 ఎక్స్‌ వేదికగా శ్రీ వైయస్‌ జగన్‌..

“ఈరోజు సీనియర్‌ వైయ‌స్ఆర్‌సీపీ నేతలతో కలిసి లోక్‌భవన్‌లో గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ గారిని కలిశాను. శాప్‌ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువతపై జరిగిన దాడికి సంబంధించిన ఆధారాలతో కూడిన సమగ్ర వినతిపత్రాన్ని గవర్నర్‌కు సమర్పించాం. డీఎస్సీ–2025లో ఏకపక్షంగా విధానాలను మార్చడం, తీవ్ర అక్రమాలు చోటుచేసుకోవడం వల్ల అది భారీ కుంభకోణంగా మారిన అంశాలను వివరించాం.”

“శాంతియుతంగా నిరసన తెలిపిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై పోలీసులు వ్యవహరించిన తీరును కూడా గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లాం. అక్రమ అరెస్టులు, చట్టపరంగా నిలబడని కేసుల నమోదు వంటి పోలీసు చర్యలపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరాం. డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై సీబీఐతో పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని కోరాం. చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి గతంలో లేవనెత్తిన ప్రశ్నలను కూడా గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రానికి జత చేశాం.”

Back to Top