శ్రీ చరణి ఒక అద్భుతం

భారత జట్టుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినందనలు
 

తాడేప‌ల్లి: ఆసియా క్రీడ‌ల్లో స్వ‌ర్ణంతో మెరిసిన భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టును వైయ‌స్ఆర్‌సీపీ  అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి 'ఎక్స్' వేదిక‌గా అభినందించారు. ఈ మేర‌కు వైఎస్ జ‌గ‌న్ స్పందిస్తూ.. ‘‘ఆసియా గేమ్స్-2026 లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టుకు నా హృదయపూర్వక అభినందనలు. టోర్నమెంట్ అంతటా జట్టు కనబరిచిన అద్భుతమైన ప్రదర్శన యావత్ దేశానికి గర్వకారణం. 

ఈ అద్భుత విజయానికి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు, జట్టులోని ప్రతి క్రీడాకారిణికి అభినందనలు. జట్టు విజయంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన శ్రీ చరణి పోషించిన పాత్రను గుర్తించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఆమె విజయ ప్రస్థానం మన రాష్ట్రంలోని యువతులకు ఎంతగానో స్ఫూర్తినిస్తుందని నమ్ముతున్నాను.’’ అని వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

Back to Top